ఓం కాలభైరవ...ఓం శ్రీ కాలభైరవాయ నమః...చింతకుంట శ్రీ కాలభైరవ స్వామి దేవస్థానం...
#
#

స్వామి వారి
దేవస్థానం

#
About Temple

చింతకుంట శ్రీ కాలభైరవ స్వామి దేవస్థానం స్థల పురాణము

చింతకుంట గ్రామంలో స్వయంబుగా వెలసిన శ్రీ కాళభైరవస్వామి చరిత్ర ద్రావిడ బాష ద్వారా వెలుగులోనికి వచ్చినది. చింతకుంట గ్రామ వాయువ్య దిశలో రెండు కి.మీ. దూరంలో | పాతచింతకుంట గ్రామము ఉండేది. పూర్వము ఈ గ్రామంపై దివిటీల దొంగలు దండు పేరుతో గ్రామంపై డాడులు చేసి ధనం దోచుకోవడంతోపాటు మహిళలపై అత్యాచారాలకు పాల్పడేవారు. దీనితో మహిళలు అక్కడ ఉన్న ఊర బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకొనేవారు. జరుగుతున్న సంఘటనలతో గ్రామస్తులు భయాందోళనలతో దిక్కుతోచని స్థితిలో దినదిన గండంగా గడిపేవారు.

ఒకరోజు సాయంత్ర సమయమున గ్రామ రచ్చబండ వద్ద సమస్యలపై చర్చించుకునే సమయంలో | ఊరికి ఆగ్నేయ మూల నుంచి ఘల్లు ఘల్లుమని గజ్జెల సవ్వడితోపాటు గుర్రం నడకల శబ్దాలు వినిపించాయి.

ఆ రోజు రాత్రి ఆకాశవాణి ప్రబోధములో గ్రామస్తులకు కల వచ్చినది. గ్రామ సమస్యల నుండి విముక్తి పొందడానికి సమీపంలో ఉన్న పుట్టలో స్వయంబు శ్రీ కాళభైరవునిగా అవతరించనున్నట్లు ఆకాశవాణి పలికినది. స్వామి గుడి నిర్మాణంతోపాటు గ్రామ నిర్మాణము కూడా చేపడితే క్షేత్రపాలకుడిగా గ్రామాన్ని రక్షిస్తానని కాళభైరవుడు ఆభయమిచ్చాడు. మరుసటి రోజు గ్రామస్తులు పుట్టను త్రవ్వగా కాళబైరవుడు అవతరించాడు. స్వామి అవతరించిన రోజు | ఛైత్ర శుద్ధ విదియ నాడు గుడి నిర్మాణం గ్రామస్తులు చేపట్టారు. అప్పటి నుండి శ్రీ కాళభైరవస్వామి గ్రామోత్సవం ఆనవాయితీగా వస్తోంది. గుడి నిర్మాణంతో గ్రామానికి ఉన్న వాస్తు దోషాలు, భూత, ప్రేత, పిశాచాడి, దాఖని దోషాలు నివృత్తి అయ్యాయని స్థల పురాణంలో ఉన్నది.

అప్పటి నుండి దివిటిల దొంగల బెడద తప్పినది. గ్రామంలో చిన్ననాగన్న అనే వ్యక్తికి శరీరమంతా పుండ్లు (బొబ్బలు) రావడంతో భయాందోళన చెందాడు, కుటుంబీకులు అతన్ని వెలివేశారు. ఆ సందర్భములో ఆయన దిక్కుదోచని స్థితిలో గుడి' ప్రాంగణంలో పడుకొన్నాడు. ఆ రోజు రాత్రి కాళబైరవస్వామి స్వప్నంలో వచ్చి మరో రెండు రోజుల్లో నీ రోగం నయమవుతుందని పలికాడు. దీనితో మూడవ రోజు అతని ఆరోగ్యం యథాస్థితికి కుదట పడినది. సంఘటన తెలుసుకొన్న గ్రామస్తులు స్వామి మహిమ| పట్ల ఆశ్చర్యపోయారు.

గతంలో కలరా వ్యాధి సోకిన సందర్భమున వివిధ గ్రామాలలో పదుల సంఖ్యలో మృతి చెందారు. అయితే చింతకుంట గ్రామంలో అఖండ దీపారాధనతోపాటు భజన కార్యక్రమములను గ్రామస్తులు నిర్వహించారు. దీంతో గ్రామంలో కలరా వ్యాధి సోకినప్పటికీ స్వామి మహిమతో ఎవ్వరూ మృతి చెందకపోవడం స్వామివారి మహిమలకు నిదర్శనం. పూర్వము చింతకుంట పరిసర ప్రాంతంలో చింతవనం వుండటంతో చింతకుంటగా నామకరణం చేసినట్లు స్థల పురాణంలో ఉన్నది. ఇప్పటికి గ్రామంలో ఆనాడు ద్రావిడ భాషలో లిఖించబడిన రాతిబండ ఉన్నది. ఇదే స్థల పురాణానికి నిదర్శనం.

Chintakunta Sri Kala Bhairava Swamy Devasthanam Stala Puranam

The history of Sri Kalabhairavaswami, who shone as Swayambu in Chintakunta village, came to light through Dravidian language. Chintakunta village is two km north-west. In the distance | There used to be a village called Patachintakunta. In the past, thieves of divinity in this village used to raid the village in the name of Dandu and looted money and raped women. With this, women used to commit suicide by jumping into the village well there. The villagers used to spend their days in a state of panic and disorientation due to the happenings.

One day in the evening while discussing the problems at village Ratchabanda From the south-east corner of the village, the sound of galloping and galloping of horses was heard.

That night, the villagers had a dream in the air broadcast. Akashavani announced that Swayambu would incarnate as Sri Kalabhairav ​​in a nearby putta to get rid of the village's problems. Kalabhairava assured that if the construction of the village is also undertaken along with the construction of the Swami temple, he will protect the village as a field ruler. The next day, when the villagers were digging the mound, Kalabairava appeared. The day when Swami appeared The construction of the temple was undertaken by the villagers on Chaitra Suddha Vidya. Since then Sri Kalabhairavaswamy Gramotsavam has been coming regularly. It is said in the Sthala Purana that with the construction of the temple, the village's Vastu Doshas, ​​Bhuta, Preta, Pisachadi and Dakhani Doshas were eliminated.

Since then, the problem of thieves has disappeared. A man named Chinnaganna in the village panicked after getting sores (blisters) all over his body and his family exposed him. On that occasion he was lying down in the temple premises in a state of disorientation. That night, Kalabairavaswamy came in a dream and said that your disease will be cured in two days. With this, on the third day his health deteriorated. Swami Mahima, the villagers who came to know about the incident Surprised by

In the past, tens of thousands died in various villages due to cholera. However, in Chintakunta village, the villagers organized bhajan programs along with Akhanda Deeparadhana. This is a proof of the glories of Swami that despite the cholera disease in the village, no one died of Swami's majesty. According to Sthala Purana, it was named as Chintakunta as there was a Chintavanam in the vicinity of Chintakunta earlier. Even now there is a stone slab in the village inscribed in the Dravidian language. This is the proof of the legend of the place.

#
About Temple

శ్రీ కాలభైరవ జనన వృత్తాంతం

పూర్వం మహర్షులు మేరుపర్వతంపై నిలబడి బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించి, అఖండ పదార్థం ఏదో, చెప్పుమని అడిగారు. అప్పుడా బ్రహ్మదేవుడు ఆ అఖండ పదార్థాన్ని నేనే. జగత్తుకు కారణభూతుణ్ణి. స్వయంభువును, ఈశ్వరుడ్జీ, ఆద్యంతరహితుణ్ణి నేనే అని బదులు చెప్పాడు. ఈ మాటల్ని నారాయణుడు విన్నాడు. వెంటనే ఆయన కోపించి, బ్రహ్మదేవునితో విధాత ! పరమోక్కృష్ణుడెవరో గ్రహించక నీవు అజ్ఞానంలో ఇలా మాట్లాడడం భావ్యం కాదు. యజ్ఞాధిపతినైన నేనే అందరికంటే ఉత్తముణ్ణి. నన్ను తిరస్కరిస్తే ఈ లోకం బ్రతుకలేదు. నేనే పరంజ్యోతిని, పరమగతిని అన్నాడు. ఇలా వారిద్దరి మధ్య వివాదం చెలరేగింది.

ఎవరి వాదన సత్యమే తేల్చుకోవడానికి వాళ్లిద్దరూ వేదాలను ఆశ్రయించారు. ముల్లోకాలలో శ్రేష్ఠుడెవరో చెప్పమని వారు వేదాలను అడిగారు. అప్పుడు వేదాలు ఓ బ్రహ్మ విష్ణువులారా! మమ్మల్ని మీరు ప్రమాణంగా అంగీకరిస్తేనే మీ ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది అని అన్నాయి. వాళ్లిద్దరూ వేదాల ప్రామాణ్యాన్ని అంగీకరించారు.

అప్పుడు ఋగ్వేదం - సమస్త జీవులు ఎవనిలో ఉన్నాయో, ఎవని వల్ల జగత్తు ప్రవర్తిస్తున్నదో. ఎవడు పరతత్వమో అతడు రుద్రుడు అని పలికింది. పిమ్మట యజుర్వేదం- ఎవడు అష్టాంగయోగ, సంపూర్ణ యజ్ఞాలతో నియమానుసారంగా పూజింపబడుతాడో. ఎనని వల్ల మాకు ప్రామాణ్యస్థితి సిద్ధమౌతున్నదో అతడు శివుడు అన్నది. ఆ తరువాత సామావేదం ఎవనివల్ల ఈ విశ్వం పరిభ్రమిస్తున్నదో, ఎవని తేజస్సుతో ఈ జగత్తు ప్రకాశిస్తున్నదో అతడే శివుడు, అతడో పరాంశ అని పలికింది. పెదవ అధర్వణవేదం - ఎవనిలో దయనిండి వున్నదో. ఏ మహాదేవుని లోకులు భజిస్తారో ఎవడు దుఃఖాలను పోగొట్టి, శుభాలనూ, సుఖాలనూ ప్రసాదిస్తాడో అతడే శంకరుడు అని ప్రవచించింది. ఇలా నాలుగు వేదాలూ శివుడే పరతత్త్వమని పలుకగా, బ్రహ్మ విష్ణువులకు రుచించలేదు. వెంటనే వారు దిగంబరుడూ, శ్మశానంలో సంచరించేవాడూ, బూడిద పూసుకొనే వాడూ అయిన ఆ శంకరుడా పరతత్త్వం ? పరబ్రహ్మతో అతనికి సామ్యమే లేదు అని దూషించారు. వారి మాటను విన్న ప్రణవం (ఓంకారం) సనాతుడూ స్వయం ప్రకాశకుడూ, సకలైశ్వర్య సంసన్సుడూ శక్తియుక్తుడూ అయిన ఈశ్వరుడు పరతత్త్వం ! అని బదులు చెప్పింది. అయితే ప్రణవం మాటలు కూడా బ్రహ్మవిష్ణువులు వినలేదు. వారిలో తేజస్సు ఆవిర్భవించి, కొంత సేపటికి ఈ తేజస్సు త్రిశూలధారీ, ఫాలలోచనుడూ, నాగభూషణుడూ అయిన శంకరునిగా రూపోందింది.

అప్పుడు బ్రహ్మదేవుడు శంకరునితో శంకరా! నీవు నా ఫాలభాగం నుండి జన్మంచావు కనుక నన్ను శరణు వేడుకో నిన్ను రక్షిస్తాను అన్నాడు. బ్రహ్మదేవుని అహంకారాన్ని గమనించిన శంకరుడు కోపంతో మరుక్షణమే ఒక భైరవుణ్ని పుట్టించాడు నాయనా! కాలభైరవా! నీవు కాలునితో (యమునితో) / సమానం. అందుకే నిన్ను కాలభైరవుడని పిలుస్తున్నాను. నీవు ఈ అహంకారమతి అయిన బ్రహ్మను ఖండించు! ఆ తరువాత ముక్తి స్థానమైన కాశీక్షేత్రానికి అధిపతివై. అక్కడ పాపాలు చేసే వారిని దండిస్తూ వర్థిల్లు! కాశీక్షేత్రంలోని పాపుల లెక్కలను చిత్రగుప్తుడు ఇకపై వ్రాయడు అని ఆదేశించాడు.

అనంతరం విష్ణువు శంకరుణ్ణి స్తుతించాడు. బ్రహ్మ భయపడుతూ శంకరుణ్ణి కీర్తించాడు. అప్పుడు భక్తవత్సలుడైన శంకరుడు వాళ్లిద్దరినీ ప్రశాంతపరిచి, కాలభైరవునితో నాయనా ! బ్రహ్మవిష్ణువులు నీకు పూజ్యులు. నీవు బ్రహ్మ శిరస్సును ఖండించి, బ్రహ్మహత్య చేశావు, కనుక, ఆ పాపాన్ని పోగొట్టుకోవడం కోసం బ్రహ్మకపాలాన్ని చేతపట్టుకొని, లోకంలో భిక్షాటన చేస్తూవుండు అని ఆదేశించాడు. వెంటనే అతని బ్రహ్మహత్యాపాపం ఒక భయంకర స్త్రీ రూపాని ధరించింది. అప్పుడా స్త్రీతో శివుడు ఓ భయంకరీ! నీవు ఈ భైరవుణ్ణి వెంటాడుతూనే ఉండు. ఈ భైరవుడు ఎప్పుడు కాశీక్షేత్రంలో అడుగుపెడతాడో అప్పుడు నీవితణ్ణి వదలిపెట్టు. నీవు మాత్రం కాశీనగరంలోనికి ప్రవేశించరాదు. అని ఆజ్ఞాపించాడు. పిదప కాలభైరవుడు బ్రహ్మ కపాలన్ని చేతిలో పట్టుకొని. ముల్లోకాలనూ చుట్టివచ్చాడు. బ్రహ్మవిష్ణువులు కాలభైరవుణ్ణి శివాంశగా భావించి నమస్కరించారు. కాలభైరవుడు ఇలా కొంతకాలం సంచారం చేసి, తుదకు కాశీనగరాన్ని చేరుకున్నాడు. అప్పుడు స్త్రీ రూపంలో వెంటాడుతున్న బ్రహ్మ హత్యాపావం మాయమైపోయింది కాలభైరవుడు ఆనందించాడు.

శ్రీ కాలభైరవుడి జనన వృత్తాంతం ఆధ్యాత్మిక జీవనానికి మరియు ధర్మపాలనకు స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని అందిస్తుంది. ధర్మానికి వ్యతిరేకంగా నడిచిన వాటికి సమర్థ సమాధానంగా, దుష్టశక్తులను సంహరించి సనాతన ధర్మాన్ని నిలబెట్టడంలో ఆయన పాత్ర అపారమైంది. కాలభైరవుడి రూపం భక్తులకు కాలాన్ని విలువైనవిగా భావించే అభిప్రాయాన్ని, ధర్మానుసారంగా నడచుకోవాలనే శక్తిని అందిస్తుంది. శ్రీ కాలభైరవుని ఆరాధన ద్వారా భక్తులు తమ జీవితాల్లో భయం నుండి విముక్తి పొంది శ్రేయోభిలాషం పొందుతారు. ఆయన అనుగ్రహంతో సకల శుభాలను పొందాలని మనస్సులో ప్రార్థిస్తూ, ఆయన శ్రద్ధతో సేవచేయడం జీవితానందానికి దారి చూపుతుంది.

Sri Kala Bhairava Janana Vruttantham

Earlier sages prayed to Lord Brahma standing on Mount Meru and asked him to tell me what is the solid material. Then Lord Brahma is that immanent substance. Cause of the world. Instead of Swayambhu, Ishvarudji, I am the Eternal One. Narayana heard these words. Immediately he got angry and spoke to Brahma! You do not understand who Paramokkrishna is and speak like this in ignorance. I, the Yagnadhipati, am the best of all. If you reject me, this world will not survive. He said, I am Paramjyoti, Paramagati. A dispute broke out between them.

Both of them resorted to the Vedas to decide whose argument was true. They asked the Vedas to tell them who was the best of the universe. Then the Vedas O Brahma Vishnu! Your questions will be answered only if you accept us as a standard. Both of them accepted the validity of the Vedas.

Then the Rigveda - in whom all living beings exist, and because of whom the world functions. She said that he who is Paratatva is Rudra. Pimmata Yajurveda- He who is properly worshiped with Ashtanga Yoga and complete Yajnas. He is Shiva because of whom we are preparing for the standard state. After that, Samaveda declared that the one who makes this universe rotate, the one with whose brilliance this world shines is Lord Shiva and he is Paramsha. Pedava Atharvanveda - In whom is mercy. It is prophesied that the one who worships the worlds of Mahadev, the one who removes sorrows and bestows blessings and happiness is Shankara. As all the four Vedas say that Shiva is Paratattva, Brahma did not like Vishnu. Immediately they are Digambaru, the one who wanders in the graveyard, the one who spreads the ashes, is that Shankara Paratattva? He was accused of having nothing in common with Parabrahma. Hearing their words, Pranavam (Omkaram) Sanatu and Swayam Prakasha, Ishvara who is all-powerful and all-powerful! She said instead. But Brahmavishnu did not even hear the words of Pranavam. Radiance arose in them, and for some time this radiance took the form of Shankara, the trident, Phalochana, and Nagabhushan.

Then Lord Brahma with Shankara Shankara! He said that since you were born from my offspring, seek refuge in me and I will protect you. Seeing Brahma's arrogance, Shankara got angry and immediately gave birth to a Bhairav ​​Nayana! Kalabhairava! You are equal with the leg (Yamuni). That is why I am calling you Kalabhairava. Deny thou this egotistic Brahman! After that he became the head of Kasikshetra, the place of liberation. Punish those who commit sins there! Chitragupta ordered that the accounts of the sinners in Kasikshetra should not be recorded any more.

Afterwards Vishnu praised Shankara. Brahma was afraid and glorified Shankara. Then the pious Shankara calmed them both down and Nayana with Kalabhairava! Brahma Vishnu is worshipful to you. He ordered that you have condemned the head of Brahma and committed brahmahatya, therefore, to remove that sin, hold the head of brahma and keep begging in the world. Soon his Brahmin took the form of a hideous woman. Then Lord Shiva with a woman is horrible! You keep chasing this Bhairav. When this Bhairava enters Kasikshetra, then leave you. You must not enter Kashinagaram. He commanded. Pidapa Kalabhairava holding the head of Brahma in his hands. He came around Mullokala. Brahmavishnu worshiped Kalabhairav ​​as Shivamsa. Kalabhairava wandered like this for some time and finally reached Kashinagar. Then Kalabhairava rejoiced as Brahma, who was chasing him in the form of a woman, disappeared.

The birth story of Sri Kalabhairava provides an inspiring message for spiritual living and Dharma practice. As an effective answer to those who went against Dharma, his role in destroying evil spirits and upholding Sanatana Dharma was immense. Kalabhairava's form gives the devotees the sense of valuing time and the power to act according to dharma. By worshiping Sri Kalabhairav, devotees are freed from fear and get good wishes in their lives. Praying in the mind to get all the blessings by His grace and serving Him diligently leads to happiness in life.