శ్రీ కాలభైరవస్వామి మహిమను, జన్మవృత్తాం తమును సుప్రభాతమును భక్తకోటికి అందించవలెననెడి మా చిరకాల వాంఛ ఇప్పటికి కార్యరూపము ధరించి, ఆవిష్కరింపబడుట స్వామిసంకల్పము. ఈ వెబ్సైట్ లో శ్రీ కాలభైరవ సుప్రభాతము, క్షేత్రవైభము, శ్రీకాలభైరవ జననవృత్తాంతము, ఆదిశంకరుల శ్రీ కాల భైరవాష్టకము, మంగళహారతి సంకలనము చేయబడినవి ఇవన్నియు స్వామి మహిమను తెలిసికొనదలచిన భక్తులకు ఉపయోగపడునని మా విశ్వాసము.
'కాలుడు' అంటే యముడు. యముని పేరుక వింటేనే లోకానికంతటికీ భయం కలుగుతుంది.
ఆ యముణ్ణి కూడా భయపెట్టే మహిమగల స్వామి కనుక కాలభైరవుడనే పేరు వచ్చింది. ఈ పేరును స్వయంగా శంకరుడే తన కుమారునికి పెట్టడాని స్కాంద పురాణం చెబుతోంది.
అష్టభైరవుల వర్ణనల ప్రాచీన గ్రంథాలలో విరివిగా కనబడుతాయి. అష్టభైరవులలో కాలభైరవుడు ముఖ్యుడు. బ్రహ్మవైవర్త పురాణంలో దుర్గాపూజకు ముందుగా అష్ట భైరవులను పూజించాలని చెప్పబడింది. వామన పురాణం లో శూలాన్ని ధరించిన భైరవుని ప్రస్తావనతోబాటు, అష్టభైర వుల వర్ణన 37వ అధ్యాయంలో ఉంది. కాలిపురాణంలో శివగణానికి అధిపతులుగా చెప్పబడినభైరవులలో మహాకాల భైరవుడున్నాడు. అతడు నిర్భయుడై, తపోధనుడై, శివ గణా ధిపతియై, శివతత్త్వ జ్ఞానియై ఉన్నాడని 4వ అధ్యాయంలోని వర్ణన చెబుతోంది. 'తంత్రసారం' అనే గ్రంథంలో కపాలాన్ని చేతితో ధరించిన భైరవుని ప్రస్తావన ఉంది.ఇలా కాలభైరవ స్వరూపం వాఙ్మయమంతటా దర్శనమిస్తుంది.
శ్రీ శంకరాచార్యకృత కాలభైరవాష్టకం సంపూర్ణమ్...
ఈ యొక్క నామాలను 41 రోజులు జపించిన వారికి సకల అష్టఐశ్వర్యములు సుఖ సంతోషములు, భోగాభాగ్యాలు కలుకును.
లింగాష్టకం సంపూర్ణమ్...